అబద్ధపు హామీలతో కాంగ్రెస్ మోసం
11-05-2024 12:05 AM
ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, మే 10 (విజయక్రాంతి): అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందని మహబూబ్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జామియా మసీదు వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ముస్లింల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని కోరారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






