26 April, 2026 | 9:33 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

నేడు చెన్నూర్‌కు కేటీఆర్

11-05-2024 12:05 AM

ప్రజా ఆశీర్వాద సభకు హాజరు

ఏర్పాట్లు పరిశీలించిన బాల్క సుమన్

మంచిర్యాల, మే 10 (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో భాగం గా చెన్నూర్‌లో శనివారం నిర్వహించే ప్రజాఆశీర్వాద సభకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరుకానున్నట్టు బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. చెన్నూర్ జడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభ ఏర్పాట్లను శుక్ర వారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో కుటుంబ పాలన సాగుతుందని, తిరిగి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే వారి ఆగడాలకు అంతులేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణి కార్మికుడైన ఈశ్వర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.