calender_icon.png 31 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులిచింతల ప్రాజెక్టు భారీగా వరద నీరు

30-07-2025 11:17:16 AM

ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పులిచింతల ప్రాజెక్టు డ్యాం అధికారులు..

హుజూర్‌నగర్,(చింతలపాలెం): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని(Huzurnagar Constituency) చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు... ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పులిచింతల ప్రాజెక్టు డ్యాం అధికారులు,ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా,ప్రస్తుతం 40.590 టీఎంసీల నీరు ఉన్నది.ఇన్ ఫ్లో 3,00,651 క్యూసెక్కులు,అవుట్ ఫ్లో 2,06,402 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు.దీంతో వరద నీటిని వినియోగించుకుంటూ తెలంగాణ జెన్ కో పవర్ జనరేషన్ ను ప్రారంభించింది.