3 April, 2026 | 3:25 AM

బీసీలను విస్మరించిన కాంగ్రెస్

03-04-2026 01:41 AM

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అన్ని రంగాల్లో తొక్కి పెడుతుందని, బీసీలు అభివృద్ధి చెందకుండా అడుగడుగునా అడ్డుకుంటుందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ గురువా రం ప్రకటనలో విమర్శించారు. చిన్న మధ్యతరహా సూక్ష్మ పరిశ్రమల కేటాయింపులలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం, జనరల్ మహిళలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 6ను విడుదల చేసిందని,

ఈ జీవోలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు కల్పించకుండా బీసీలను విస్మరించిందని అని అన్నారు. బీసీలపై బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యే ఎంపీలకు ఏమా త్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జీవో 6ను సవరించి బీసీలకు కూడా 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.