3 April, 2026 | 3:31 AM

పకడ్బందీగా పథకాల అమలు: సీఎస్

03-04-2026 01:40 AM

మహేశ్వరం, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. ’99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి హాజరయ్యారు.

వివిధ శాఖలు (సంక్షేమ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖలు) ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎస్ సందర్శించారు. గ్రామ సభలో సీఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.  అ దనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్ పాల్గొన్నారు.