calender_icon.png 20 August, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు యూరియా కొరత లేకుండా చూడండి

20-08-2025 12:44:24 AM

గద్వాల, ఆగస్టు 19 ( విజయక్రాంతి ) :  జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా చూడాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలెక్టర్ సంతోష్ను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మాజీ మంత్రి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ని కలిసి వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ..

గత సంవత్సరం నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ సంవత్సరం వానాకాలం పంటకు సంబంధించి 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని అయితే రైతులు ఇప్పటివరకు 14900 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి వినియోగించుకున్నారని ఈ సందర్భంగా కలెక్టర్కు గుర్తు చేశారు. ఇంకా పదివేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అత్యవసరమని చెప్పారు. 

జూరాల గేట్లకు సంబంధించి రోప్లు తెగి గేట్లకు ప్రమాదం పొంచి ఉన్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రాజెక్టు పరిశీలన చేసి ఇందుకు కావలసిన ప్రతిపాదనలు పంపాలని అధికారుల ఆదేశించారని చెప్పారు.  మాజీ మంత్రి వెంట గద్వాల బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు నాయుడు తదితరులుఉన్నారు.