05-07-2025 02:00:34 AM
షోకాజ్ నోటీసు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి పీసీసీ సూచన
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య నెలకొన్న పంచాయతీలతో పాటు సొంత పార్టీపైనే విమర్శలు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై పీఏసీ సమావేశంలో చర్చ జరిగింది. ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.
వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీపైన పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ అయింది. ఇప్పటికే కొండా మురళి కలిసి వివరణ ఇవ్వగా, శుక్రవారం వరంగల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయి ని రాజేందర్‌రెడ్డి కూడా క్రమశిక్షణ కమిటీని గాంధీభవన్‌లో కలిసి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. కొండా దంపతులు జిల్లావ్యాప్తంగా ఒక వర్గాన్ని తయారు చేసుకొని పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని రాజేందర్‌రెడ్డి కమిటీకి వివరించారు.