05-07-2025 01:54:20 AM
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
సంగారెడ్డి, జూలై 4 (విజయక్రాంతి): సిగాచి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ శుక్రవారం విచారణ చేపట్టింది. పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు కారణంగా ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. గత ఐదు రోజుల నుంచి రెస్క్యూ టీం శిథిలాల తొలగింపు చేపడుతున్నది.
గురువారం నలుగురు సభ్యులతో కూడిన అధ్యయన బృం దం ఘటన స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. వివిధ రకాల శాంపిల్స్ సేకరించడమే కాకుండా ప్రమాదానికి గల కారణాలు, లోపాలను తెలుసుకొని నెలరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మరో హైలెవెల్ కమిటీ బృందం శుక్రవారం కంపెనీని పరిశీలించింది.
ఈ కమిటీలో స్పెషల్ సెక్రటరీ రెవె న్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ అరవింద్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ,స్పెషల్ సెక్రటరీ దాన కిషోర్ ఉన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరతోష్ పంకజ్, అగ్నిమాపక శాఖ అధికారులతో పరిశ్రమలో అగ్నిమాపక శాఖ, పొల్యూషన్, డిజాస్టర్ మేజేజ్‌మెంట్, సిబ్బంది, పరిశ్రమల శాఖ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు.
ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిశ్రమల భద్రతా ప్రమాణాలు, భద్రతా ప్రమా ణాల నిర్వహణపై చర్చించారు. పరిశ్రమలో రియాక్టర్లు, డ్రయ్యర్లు, ఫైర్ ఫైట్ సిస్టం, ఉద్యోగుల రక్షణ మార్గాలు, ఇతర భద్రతా అంశాలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల కోసం ఐలా కార్యాలయంలో ఏర్పా టు చేసిన సహాయక కేంద్రాన్ని ప్రభుత్వ సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎస్
ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుం దని సీఎస్ రామకృష్ణారావు భరో సా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలం దించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని వెల్లడించారు.
ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరా లు, మృతుల వివరాలు, మృతుల గుర్తింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా త్వరలో మృ తుల కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు ఆర్థిక సహా యం అందజేయ నున్నట్లు తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నా రు. సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.