02-08-2025 11:18:34 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): జనహిత పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో భాగంగా శనివారం సాయంత్రం ఆర్మూర్లో తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రారంభంబంచారు. అనంతరం జనహిత పాదయాత్ర ఆర్మూర్ నగరంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నలుమూలల నుండి తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కార్యకర్తలు వివిధ మండలాల నాయకులకు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆర్మూర్ లో పాదయాత్ర నిర్వహించారు.
ఎఐసీసీ ప్రతిషా త్మకంగా నిర్వహిస్తున్న జై బాపూ, జై భీం, జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ సాయంత్రం 5:30 గంటలకు చేరుకున్నారు. మీనాక్షి నటరాజన్ వెంట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జనహిత పాదయాత్ర ప్రారంభించారు. ఆర్మూర్లో ప్రారంభమైన జనహిత పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఆర్మూర్ వినయ్ కుమార్, బాల్కొండనూడ చైర్మన్ కేశ వేణు ముత్యాల సునీల్ రెడ్డి, పాలకొండ ముత్యాల సునీల్ రెడ్డి, వివిధ మార్కెట్ కమిటీల చైర్మన్లు తదితరులు హాజరయ్యారు. పాదయాత్ర ఆర్మూర్ లోని కింద గల్లీ (ఆలూర్ బైపాస్ )నుండి వయ గోలబంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదిగా పెర్కిట్ చౌరస్తా వరకు జరుగుతోంది. అనంతరం సర్కిల్ చౌరస్తాలో కార్యకర్తలను ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ ప్రసంగించా ఉన్నారు.