27 August, 2026 | 3:45 AM

మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి

27-08-2026 02:26 AM

జిన్నారం, ఆగస్టు 26: బొల్లారం డివిజన్ పరిధిలో మీలాదు ఉన్ నబి వేడుకలను ముస్లిం సోదరులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు సోదరులు కుల మతాలకు అతీతంగా నిర్వహించిన భారీ శాంతి ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వి.చంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్వ మానవాళి శ్రేయస్సు కోసం కృషి చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు.

ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్నబి శుభాకాంక్షలు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులను ముస్లిం సోదరులు మత పెద్దలు ఘనంగా సన్మానించారు. పట్టణంలో ర్యాలీ ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖలీమ్, మునీర్, తాహీర్, యువజన నాయకులు అబ్దుల్ బషీర్, రియాజ్, అజామ్, ఖాసీమ్, ముక్తర్, ఇంతియాజ్, అఫు, ముస్లిం సోదరులు, మత పెద్దలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.