బీసీ ఉద్యమానికి జాతీయ గౌరవం
పూలే ద్విశత జయంతి కమిటీలో ఆర్ కృష్ణయ్యకు స్థానం
మోదీ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
ముషీరాబాద్,ఏప్రిల్ 15(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించబడనున్న మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి ఉత్సవాల జాతీయ కమిటీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సభ్యుడిగా ఎంపిక కావడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుందని తీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పేర్కొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక కమిటీలో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, లోక్సభ స్పీకర్తో పాటు 34 మంది కేంద్ర మంత్రులు, 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భాగస్వాములవడం ఈ ఉత్సవా ల విస్తృతిని స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా నిరంతర పోరాటం సాగించిన ఆర్. కృష్ణయ్యకు ఈ కమిటీలో స్థానం కల్పించడం గౌరవప్రదమైన నిర్ణయమని పేర్కొన్నారు.
బీసీ ఉద్యమ చరిత్రలో ఆర్. కృష్ణయ్య పోరాటాలు కీలక మలుపు తిప్పాయని ఆయన వివరించారు.2028 ఏప్రిల్ 11 వరకు కొనసాగనున్న ఈ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పూలే ద్విశత జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శ కత్వంలో ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఈ వేడుకలను విజయవంతం చేయాలని గుజ్జ సత్యం పిలుపునిచ్చారు.






