23-11-2025 10:30:57 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేటలోని సందీప్ డీలక్స్ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో కాంగ్రెస్ నాయకుడు మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ఉమ్మరవేణి రాజు(42) రెండు రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని సందీప్ లాడ్జిలో అద్దెకు దిగాడు. ఆదివారం సాయంత్రం గడువు ముగియడంతో లాడ్జి నిర్వాహకులు గదికి వెళ్లారు. బాత్రూమ్ లో రాజు అపస్మారక స్థితిలో కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఇల్లంతకుంట మండలం కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడని తెలిసింది. రాజు మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది.