23-11-2025 09:41:08 PM
బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
నిర్మల్ (విజయక్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని 100 మంది బీజేవైఎం నాయకులు గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు చేపడుతున్న “Sardar @150 Unity Yatra” జాతీయ యాత్రను ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైన యాత్ర ఆదివారం సాయంత్రం నిర్మల్ చేరుకుంది. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, నిర్మల్ లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేవైఎం నాయకులను అభినందించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.