23-11-2025 10:22:27 PM
మంథనిలో ఘనంగా ముగిసిన సత్య సాయి శత జయంతి వేడుకలు..
అలరించిన మహావాది సోదరుల సంగీత విభావరి..
మంథని (విజయక్రాంతి): భగవాన్ శ్రీ సత్య సాయిబాబా భక్తులకు చూపిన మార్గం ఆనందదాయకమని, ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవించాలని ఆయన కోరుకునే వారని మంథని సత్య సాయిబాబా సేవా ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గంగా రాధా కిషన్ అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ముగింపు సందర్భంగా సంగీత విభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా శతా బాబా శత జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. సంగీత సంగీత విభావరి కార్యక్రమంలో గాయకులుగా మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే చివరి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, నిరుపేదలకు దుస్తులు, మందులు అందజేసినట్లు ఆయన తెలిపారు.
అలరించిన మహావాది సోదరుల భక్తి గీతాలు
శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్లు, క్రీడా విశ్లేషకులు మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంది. గాయకులుగా వారు పాడిన హిందీ, తెలుగు భక్తి పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా ప్రముఖ గాయకుడు స్వర్గీయ కిషోర్ కుమార్ ఆలపించిన భక్తి పాటలు వీరు ఎంతో మధురంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండా శంకర్, అష్టదని గంగాధర్, రామడుగు మారుతి, మేడగోని రాజమౌళి గౌడ్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజం, నల్లగొండ శ్రీనివాస్, అవధానుల శ్రీనివాస్, రామడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.