23-11-2025 10:18:11 PM
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): గత నెల 26న నమోదైన గంజాయి కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఆకాష్ సింగ్‌ను నాగర్‌కర్నూల్ పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా తాజాగా ధూల్‌పేట, మంగళ్‌హాట్‌కు చెందిన ఆకాష్ సింగ్‌ను నాగర్‌కర్నూల్‌కు తరలించి రిమాండ్‌కు పంపించినట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్సై గోవర్ధన్ కానిస్టేబుల్ భీముడు ఉన్నారు.