calender_icon.png 23 November, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల కాపరి గల్లంతు.. రెస్క్యూ టీం గాలింపుతో మృతదేహం లభ్యం

23-11-2025 10:09:52 PM

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఘటన..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని సరంపల్లి శివారలో రైల్వేట్రాక్ వద్ద ఆదివారం ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 90 గొర్రెలు మృతిచెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి దేవునిపల్లి గ్రామానికి చెందిన సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే ఆయనతో పాటు ఉన్న మరొక దర్శనపు సుధాకర్ ఈత రాకపోవడంతో వాగులో గల్లంతు అయ్యారు. పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రైల్వే ట్రాక్ పైనుంచి గొర్రెల మందను దాటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన గొర్రెల కాపరి దర్శనం సుధాకర్ మృతదేహం ఆదివారం రాత్రి లభించిందని రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. మృతుడు సుధాకర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న సుధాకర్ మృతిచెందడం ఆ కుటుంబాంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దేవునిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.