calender_icon.png 23 November, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిడేపల్లి మండలం గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు

23-11-2025 10:02:31 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలోని 33 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఆదివారం ఖరారు అయ్యాయి. గతంలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొండాయిగూడెం గ్రామస్తుల విన్నపం మేరకు నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు.దీంతో ప్రస్తుతం గరిడేపల్లి మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గరిడేపల్లి మండలంలో 33 పంచాయతీలు ఉండగా 16-జనరల్ కు కేటాయించగా మహిళలకు 8, పురుషులు 8 కేటాయించారు. బీసీలకు 8 కేటాయించగా అందులో మహిళలకు 4 పురుషులు 4 కేటాయించారు. ఎస్సీ లకు 6 కేటాయించగా మహిళలకు 3 పురుషులకు 3 కేటాయించారు. ఎస్టీ లకు 3 కేటాయించగా అందులో మహిళలకు 1, పురుషులకు 2 కేటాయించారు.

మండల కేంద్రమైన గరిడేపల్లి గ్రామపంచాయతీకి బీసీ (మహిళ), పొనుగోడు బీసీ జనరల్, సర్వారం బీసీ మహిళ,రాయిని గూడెం బీసీ జనరల్, వెలిదండ బీసీ జనరల్, గానుగ బండ బీసీ మహిళ, కట్టవారిగూడెం బీసీ జనరల్, కోనాయిగూడెం బీసీ మహిళ, కల్మలచెరువు ఎస్సీ జనరల్, పరెడ్డిగూడెం ఎస్సీ జనరల్, అప్పన్నపేట ఎస్సీ మహిళ, కాల్వపల్లి ఎస్సీ మహిళ, కోదండ రామాపురం ఎస్సీ మహిళా, చిన్న గారగుంట తండా ఎస్టీ జనరల్ ,లచ్చాతండా ఎస్టి మహిళ, శీతల తండా ఎస్టీ జనరల్, అబ్బిరెడ్డిగూడెం జనరల్ మహిళ, ఎల్బీనగర్ జనరల్, లక్ష్మీపురం జనరల్, మంగాపురం జనరల్, గడ్డిపల్లి జనరల్ మహిళ,గార కుంట తండా జనరల్ మహిళ, కాచ వారి గూడెం జనరల్, కీతవారిగూడెం జనరల్,వెంకటరాంపురం జనరల్ మహిళ ,కుతుబ్బిషాపురం జనరల్, రామచంద్రపురం జనరల్ మహిళ, రంగాపురం జనరల్ మహిళ, రేగులగడ్డ తండా జనరల్, కొత్తగూడెం జనరల్ మహిళ, మర్రికుంట జనరల్, కొండాయిగూడెం (నూతన గ్రామపంచాయతీ) జనరల్ మహిళ గా స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు.