18-12-2025 01:11:53 PM
హైదరాబాద్: నగరంలోని గాంధీభవన్ నుంచి భారతీయ జనతా పార్టీ(BJP) కార్యాలయం వరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ తీశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు వివిధ జిల్లా నుంచి నేతలు గాంధీభవన్ కు భారీగా తరలి వచ్చారు.
బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా తలపెట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే గాంధీభవన్, బీజేపీ కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు భారీ మోహరించాయి. బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నాకు పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలో బారికేడ్లు పెట్టారు. ఈ నిరసనకు అనుమతి లేదని చెప్పడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తో పాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు.