calender_icon.png 18 December, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిన ఆర్టీసీ బస్సు

18-12-2025 02:43:54 PM

తప్పిన  పెను ప్రమాదం

రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్

కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): కెరమెరి మండలం పరండోలి ఘాట్ రూట్ లో ఆర్టీసీ బస్సులు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఘాట్ పై నుండి పంట పొలాల్లోకి దూసుకువెల్లింది. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరండోలి నుండి ఆదిలాబాద్ కు వెళుతున్న క్రమంలో బస్సు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. రెండేళ్లలో మూడు ప్రమాదాలు జరిగాయని గ్రామస్తులు తెలిపారు. గతంలో జరిగిన  ప్రమాదంలో పలువురు మృతి చెందిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మించాలని సర్పంచ్ రాథోడ్ పుష్పలత,గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.