calender_icon.png 18 December, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెస్ అగర్వాల్ బాయిలర్ పేలుడు ఘటనలో మరో వ్యక్తి మృతి

18-12-2025 02:34:42 PM

మనోహరాబాద్,(విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం రంగాయపల్లి ఎంఎస్ అగర్వాల్ లో జరిగిన బాయిలర్ బట్టి విస్పోటం చెందిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స ప్రతిఘటించి మరో వ్యక్తి మృతి చెందడం జరిగింది. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్ పాండేగా గుర్తించారు. చనిపోయిన వ్యక్తి కి భార్య, ఇద్దరూ కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నట్లు గుర్తించారు.

ఎమ్మెస్ అగర్వాల్ బాయిలర్ పేలుడు ఘటనలో మరో వ్యక్తి చనిపోవడంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. యాజమాన్యం నిర్లక్ష్యం తో బాయిలర్ పేలుడు విస్పోటం చెందిందని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్ని జరిగినా యాజమాన్యం జరుగుతున్న సాంకేతిక లోపాలు సరి చేసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పలుమార్లు పునరావృతం అవుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. తక్షణమే ఎమ్మెస్ అగర్వాల్ యాజమాన్యంపై మేనేజర్ పై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.