18-12-2025 02:23:50 PM
బీ ఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పై గెలిచిన శాసన సభ్యులు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉండగా ,రాజ్యాంగ ఉల్లంగనకు పాల్పాడుతు అనర్హత పిటిషన్ లను రద్దు చేయడం సరియైంది కాదని విమర్శించారు.
అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పీకర్ ను నిర్ణయం తీసుకొమ్మని ఆదేశం ఇచ్చినప్పటికి ముఖ్యమంత్రి సూచన మేరకు పిటిషన్లు రద్దు చేయడం సరి కాదు. ఇంతటితో ఆగి పోదు బిఆర్ఎస్ పోరాటం పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యే ల పదవీ రద్దు అయ్యేంత వరకు హైకోర్టు, సుప్రీంకోర్టుల ద్వారా చట్టపరమైన పోరాటం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం కొనసాగిస్తదని హెచ్చరించారు.