calender_icon.png 24 December, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షలు గోల్ మాల్..!

23-12-2025 11:35:32 PM

రూ.లక్షల నిధులు మాయం.. పట్టించుకునే నాథుడే కరువు..

గ్రామపంచాయతీ సిబ్బంది, అధికారులకు వత్తాసు పలుకుతున్న జిల్లా అధికారులు

పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల డిమాండ్

బాన్సువాడ, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు క్రింద ప్రతి సంవత్సరం వస్తాయి 2021 22 , 2022 23 లో పెరిగింది ఎందుకని సర్పంచ్ కాలపదిమితి అయిపోయే సమయానికి కొన్ని నిధులు వాడినారు . సమాచారం చట్టం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన ఓ సామాజిక కార్యకర్త వెల్లడించిన వివరాలు ఇవి 2023లో దోమల మందు బ్లీచింగ్ పౌడర్ కి 98,900 ఖర్చు చేసినట్టు ఇవ్వడం జరిగింది.

చెత్త బండి ట్రాక్టర్ రోజుకి5 నుంచి 6 లీటర్లు వాడుతున్నట్టు చూపించారు. వాటర్ ట్యాంకులు కడగడానికి 60000 వరకు చూపబడి ఉంది ఇలా చెప్తే చాలా ఉన్నాయి .దాదాపు ఒక్క సంవత్సరంలోనే పది లక్షల పైనే (2022 2023) సంవత్సరం నిధులు దుర్వినియోగం జరిగినట్టు కనబడుతుంది..బసవేశ్వర గుట్ట దగ్గర లేఅవుట్ చేసిందానికి 64 మంది బీడీ కార్మికులు 40 వేల చొప్పున జమ చేసి ప్లాట్ లని చేసుకుంటే సందులోమందు పది లక్షలు నొక్కేశారు

సాక్షాత్తు వాళ్ళ పెద్దమనుషులే ప్రెస్ మీట్ లో చెప్పడంతో బయటపడింది అంటే 35 లక్షలు బీడీ కార్మికుల ప్లాట్ లకి ఖర్చు చేసినట్టు గుర్తించాలి మరి నిజంగానే ఖర్చయిందా....?. స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఇతర పనులకు 24 లక్షలు కేటాయించారు ఏమైంది అన్ని దొంగ పింఛన్లే కాళ్లు విరగకుండా విరిగినట్టు నరాలు సమస్య ఉందని డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం పింఛను పొందడం ఇది బోర్లను పరిస్థితి 35 మందికి పైన్నే దొంగ పింఛన్లు పొందుతున్నట్టు సమాచారం.

అప్పటి కార్యకర్తల కోసం ప్లాట్లు ఇవ్వడానికి ప్రజల భూమిని కేటాయించారు ప్రజల భూమి కార్యకర్తలకు ఎందుకు ఇవ్వాలి కావాలంటే 10 ఎకరాలు కొని ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు మాభూమి మాకే సొంతం. బీటీ రోడ్లు వేసినట్టు చూపించారు ఎక్కడ వేశారు 8 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు? అన్నది ప్రశ్నార్థకగా మిగిలింది

బోర్లం సొసైటీ నిధులు....

ఒకప్పుడు కోటి రూపాయల కుంభకోణం జరిగింది దానిపై విచారణ జరిపించండి అంటూ అప్పటి గ్రామవాసులు విజ్ఞప్తి చేసినప్పటికీ దానిపై ఎలాంటి విచారణ జరగకపోగా ఆ కుంభకోణాన్ని కప్పి ఉంచి సొసైటీకి నష్టం వాటిల్లటట్టు చేశారు.ఒక నెల క్రితం బయటపడిన మరో కుంభకోణం బోర్ల సొసైటీ ఇది సాక్షాత్తు 1 కోటి 34 లక్షల రూపాయలు లోన్ల ఇచ్చి ఇప్పటికి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి రికవరీ జరపలేదు భూమి లేని వాడికి 18 లక్షలు లోన్లు కేటాయించారు బోర్లం గ్రామానికి సంబంధం లేని వాడికి లోన్లు మంజూరైనై ఒకరు నాలుగు లక్షల 8 లక్షలు ఒకళ్ళు మూడు లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే కోటి 34 లక్షలు రికవరీ కావాల్సి ఉంది . నిధులను రికవరీ చేయడంలో సంబంధిత శాఖ అధికారులు అధికార నేతలకు భయపడి రికవరీ చేయడంలో జాప్యం కొనసాగుతుంది.