15 March, 2026 | 6:27 PM

Breaking News

మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •  

మహా చండీయాగం పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

10-10-2024 11:45 AM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బంగారు మైసమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా జరుగుతున్న మహా చండీయాగంలో బుధవారం రాత్రి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబులు పాల్గొని పూజలు చేశారు. నవరాత్రులలో భాగంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మల్లారపు చినరాజం, జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, కాంగ్రెస్ నాయకులు సిలువేరు సత్యనారాయణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవసాని ఆనంద్, ఆలయ కమిటీ చైర్మన్ గెల్లి రాయలింగు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె. కుమారస్వామి, ట్రెజరర్ అనుముల సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు ఎం .రమేష్, పి .శ్రీనివాస్ లతో పాటు భక్తులు పాల్గొన్నారు.