15 March, 2026 | 9:22 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఆర్టీసీ బస్సులో బంగారం, సెల్ ఫోన్ చోరీ

10-10-2024 11:50 AM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల నుండి కాగజ్ నగర్ వైపు ప్రయాణికులతో వెళుతున్న టీఎస్ 20 టి 3003 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో బుధవారం రాత్రి రెండు తులాల బంగారు గొలుసు తో పాటు సెల్ ఫోన్ చోరీకి గురైంది. మంచిర్యాల నుండి కాగజ్ నగర్ కు వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సులో పాత బస్టాండ్ వద్ద గోలేటి కి చెందిన జె. అనిత అనే మహిళ దసరా పండుగ సందర్భంగా బెల్లంపల్లిలో షాపింగ్ ముగించుకొని తిరిగి వెళుతుండగా బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు.

షాపింగ్ కోసం బెల్లంపల్లికి వచ్చిన సదరు మహిళా స్థానిక జువెలరీలో తన పాత గొలుసును మార్పిడి చేసుకొని ఆర్డర్ పై తయారు చేయించుకున్న రెండు తులాల బంగారు గోపి తాడు తీసుకొని పాత బస్టాండ్ వద్ద బస్సు ఎక్కింది. బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చాక బట్టల సంచులు పరిశీలించడంతో బంగారు గొలుసు, ఆమె వాడుతున్న సెల్ ఫోన్ కనిపించలేదు. దీంతో ఆర్టీసీ బస్సులో తన రెండు తులాల బంగారు గొలుసుతో పాటు సెల్ ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే వన్ టౌన్ పోలీసులు కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఆర్టీసీ బస్సును ఆపి ప్రయాణికులు అందర్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎవరి వద్ద ఏమి లభించకపోవడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.