17 April, 2026 | 12:11 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

అమ్మ నాన్నలను కోల్పోయిన యువతులకు అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు

08-09-2024 08:30 PM

మందమర్రి,(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిదిలోని మందమర్రి(వి) గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన యువతులకు కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందచేశారు. ఆదివారం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా గ్రామానికి చెందిన భూనేని దోనాచారి-లక్ష్మి దంపతులు అనారోగ్యంతో  మరణించగా వారి కూతుర్లు  అర్చన, అభిలాషలు అనాధలుగా మారారు.

పేదరికంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబం తల్లిదండ్రులను కోల్పోవడంతో చదువుకునే  ఇద్దరు ఆడపిల్లలు  రోడ్డున పడే పరిస్థితి రావడం చాలా బాధాకరం అని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆకుటుంబానికి వెన్నంటి ఉంటామని భవిష్యత్తులో  సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరులల్ రెడ్డి, రాయబారపు కిరణ్, సట్ల సంతోష్,పాల్గొన్నారు.