5 June, 2026 | 2:43 AM

ఇంద్రకరణ్ రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

05-06-2026 01:33 AM

భిక్కనూర్, జూన్ 4(విజయ క్రాంతి): ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డిను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం కొంపల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలను పాటిస్తూ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై కూడా కొద్దిసేపు చర్చించిన నాయకులు,

ఇంద్రకరణ్ రెడ్డి త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగారెడ్డి, నారాగౌడ్, తుడుం స్వామి, యువజన కాంగ్రెస్ నాయకులు తుడుం ప్రేమ్, తుడుం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఇంద్రకరణ్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.