06-02-2026 07:23:56 PM
చర్ల, (విజయక్రాంతి): చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేందుకు వద్దిపేట,పూసుగుప్ప గ్రామాల మధ్యలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు.
దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా,సైబర్ నేరాల పట్ల ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై గణేష్,సిబ్బంది పాల్గొన్నారు.