calender_icon.png 7 February, 2026 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాటి చెట్టుపైనే ప్రాణాలు విడిచిన గీత కార్మికుడు

06-02-2026 07:21:25 PM

తంగళ్ళపల్లి,(విజయకాంత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కిన సాయి కిషన్ (గౌడన్న) అనే గీత కార్మికుడు చెట్టుపైనే అకస్మాత్తుగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు ఆయనను కిందకు దింపేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.