24 April, 2026 | 1:41 AM

అసంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన

19-12-2024 01:00 PM

హైదరాబాద్: డా.బీఆర్‌ అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అసంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.