24 April, 2026 | 3:06 AM

ఆర్టీసీ సమ్మెపై సీఎం చొరవ తీసుకోవాలి

24-04-2026 01:39 AM
  1. ఉద్యమకారులతో చర్చలు జరిపి డిమాండ్లు అంగీకరించాలి
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): రెండు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో ఒక కార్మికుడు నర్సంపేట డిపోలో ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంగా సమ్మె ఉదృతం అవుతున్నందున, దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకొని స్పందించి చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లు అంగీకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం విద్యానగ ర్లోని బీసీ భవన్ లో మీడియాతో ఎంపీ ఆర్ కృష్ణ య్య మాట్లాడు తూ ఆర్టీసీ సమ్మె మూలంగా రాష్ట్రవ్యాప్తంగా జన జీవనం స్తంభించి పోయిందన్నారు. ఒకవైపు విద్యార్థులకు పరీక్షల సీజన్ ఇంకొకవైపు,  పెళ్ళిలో సీజన్ ఎంత ప్రాము ఖ్యం గల సమయంలో సమ్మె చేస్తున్నందున సమ్మె ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం చాలా దారుణ మన్నారు. పేద గ్రామీ ణ ప్రజలు బస్సులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

బస్సు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు ప్రజలను ఎక్కువ ఛార్జీలు వేస్తూ పీక్కు తింటున్నారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పరిస్థితి విషమించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నెల రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం జాప్యం చేసిందన్నారు. అనివార్యంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయన్నారు. ఫీజులు బకాయిలు రాక విద్యార్థులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, డిమాండ్లు పరిష్కరించక ఉద్యోగులు, ఇలా అన్ని వర్గాల వారు ఆందోళన చెందుతున్నారన్నారు. రాజకీయ పార్టీలు నాయకులు మ్యాచ్ పిక్సింగ్ ల వాతలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.