నేటి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు
శుక్ర, శనివారాల్లో వర్షాలు
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరికొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లగా మారి ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండ దంచి కొడుతుంటే సాయంత్రం కాగానే వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో గురువారం వర్షం కురిసింది.
ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌తోపాటు కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం నిర్మల్ అక్కాపూర్‌లో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.






