అల్కాపురి కాలనీలో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్: అల్కాపురి టౌన్ షిప్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకొని కమర్షియల్ షెట్టర్స్ వేశారంటూ హైడ్రా కూల్చివేసింది. హైడ్రా,పోలీసులను అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్ మెంట్ వాసులు అడ్డుకున్నారు. అపార్ట్ మెంట్ వాసుల అభ్యర్థనలను పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. మణికొండ మున్సీపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్‌లు కట్టినా ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులకు, వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత నెల 27న మణికొండ మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. 7 రోజుల్లో షట్టర్లు తొలగించాని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు స్పందించకపోవడంతో షట్టర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.






