గ్యాస్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం
కావాలనే కొరత సృష్టిస్తున్నారు
దేశవ్యాప్తంగా రోజువారీ డిమాండ్ 55 లక్షల సిలిండర్లు
కాంగ్రెస్ సృష్టించిన భయాందోళనతో 76 లక్షలకు పెరిగింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): దేశంలో గ్యాస్ కొరత లేదని, ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ కృత్రిక కొరతను సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా రోజువారీ గ్యాస్ డిమాండ్ 55 లక్షల సిలిండ ర్లు కాగా, కాంగ్రెస్ సృష్టించిన భయాందోళనల వల్ల అది 76 లక్షలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎందుకున్నదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో యూత్ కాంగ్రెస్ నేతలు వేలాది సిలిండర్లను అక్రమం గా నిల్వ చేస్తూ పట్టుబడ్డారని చెప్పారు. శనివా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు సమక్షంలో మహేశ్వరం అసెంబ్లీ నియో జకవర్గానికి చెందిన వివిధ ఫెడరేషన్ ఆఫ్ కాలనీల సభ్యులు ఒంటేరు నర్సింహారెడ్డి ఆధ్వర్యం లో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా రాం చందర్‌రావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల్లోనూ భారత్ సురక్షితంగా ఉన్నదని, ఇరాన్- యుద్ధం జరుగుతున్నా, ప్రధాని మోదీ ఆయా దేశాలతో మాట్లాడి హార్మోజ్ జలసంధి ద్వారా భారత్‌కు గ్యాస్, చమురు సరఫరా ఆగిపోకుండా చర్య లు తీసుకున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తం గా గ్యాస్ ధరలు 50 శాతం పెరిగినా, భారత్ లో ధరలు పెరగకుండా సామాన్యుడిని కాపాడుతున్న ఘనత ప్రధాని మోదీది అన్నారు. 1958లో అప్పట్లో కొరియా యు ద్ధం జరుగుతోందని సాకు చూపి, భారత్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయని అప్పటి ప్రధాని నెహ్రూ మాట్లాడారని, అంటే.. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ భారం వేశారన్నారు.
కానీ నేడు చమురు ఎగుమతి చేసే దేశాలే నేరుగా యుద్ధంలో ఉన్నప్పటికీ.. భారతదేశంలో చమురు సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వియత్నాంలో 50 శాతం, పాకిస్థాన్ శాతం పెరుగుదల, కంబోడి యాd19 శాతం పెంచారు.. కానీ, భారతదేశంలో మాత్రం సామాన్యుడిపై భారం మోప లేదన్నారు. దేశ వ్యతిరేక చర్యలకు కాంగ్రెస్ పాల్పడుతూ, తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించడం అలవాటుగా మారింద న్నారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
50 మీటర్ల బఫర్ జోన్ అవసరం లేదు
మూసీ పునరుజ్జీవానికి రూ.7 వేల కోట్లు అంటున్నారని, అయితే 50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదని రాంచందర్‌రావు అభిప్రాయపడ్డారు. గాంధీ విగ్రహం ఏర్పాటు కు 100 ఎకరాలు కావాలా అని నిలదీశారు. 10 వేల మందికి ముందుగా పునరావాసం కల్పించి గుజరాత్‌లో ఎవరికీ నష్టం లేకుండా సబర్మతి ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రూ.60 వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్ల కు అంచనా బడ్జెట్‌ను పెంచినట్టే, రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టును రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లకు పెంచారన్నారు.
మూసీలో కలిసే డ్రైనేజీ వాటర్, ఇండస్ట్రియల్ వేస్ట్‌ని ఆపకుండా, ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టకుండా కేవలం పేదల ఇళ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. చేతిలో గడ్డపార పట్టుకుని పేదల ఇళ్లను కూల్చడమే పనిగా సీఎం పెట్టుకున్నారని విమర్శించారు. చట్టబద్ధంగా ఇళ్లు కట్టుకున్న వారిని రోడ్డున పడేస్తే బీజేపీ ఊరుకోదన్నారు. కేసీఆర్ నాడు హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తానని ఎలాగైతే మోసం చేశారో, రేవంత్ రెడ్డికూడా మూసీ పేరుతో అదే బాటలో నడుస్తున్నారన్నారు.
సంక్షేమ పథకాలను చేరవేయాలి
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ నాయకులతో రాంచందర్‌రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు, కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. రాను న్న రోజుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజ యం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూ పాల్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి. సుభాష్ పాల్గొన్నారు.




