06-12-2025 01:12:51 PM
హైదరాబాద్: మీసేవ సెంటర్లలో సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తింది. నెట్ వర్క్ సమస్యతో సర్వర్లు ఆలస్యంగా పనిచేస్తున్నాయి. 15 రోజులుగా ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. సమస్య పరిష్కరించకపోతే ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని మీసేవ సెంటర్స్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ హెచ్చరించారు. మీసేవ సెంటర్లలో సమస్యలు తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.