కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
రాజేంద్రనగర్ బీజేపీ నాయకుడు నిరుడు పవన్ సాయి
రాజేంద్రనగర్ మార్చి 28 (విజయక్రాంతి) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని రాజేంద్రనగర్ సర్కిల్ బిజెఎం సిబిజెపి కార్యదర్శి నీరుడు పవన్ సాయి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హామీ నిలుపు కోవడం లేదన్నారు. యువ వికాస పథకాన్ని గాలికి వదిలేసిందన్నారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు పత్తా లేకుండా పోయిందన్నారు. గృహజ్యోతి పథకాన్ని తూతూ మంత్రంగా అమలుచేసి చేతులు దులుపుకుందన్నారు. ఈప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.




