calender_icon.png 4 August, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల కోసమే కాంగ్రెస్.. కోటా మంత్రం

03-08-2025 01:00:10 AM

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాం తి): ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోటా మంత్రాన్ని జపిస్తోందని, కాంగ్రె స్ చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు మేలు చేసే రిజర్వేషన్లు కావని, మతపరంగా, ఓట్ల పరంగా రాజకీయాల కోసం ముస్లింలకు మేలు చేసేందుకే ఈ తతంగమని కేంద్రమంత్ర కిషన్‌రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ పాలకులు జనాభా లెక్కల్లో కులగణన చేశారని, ఆ తర్వాత కాంగ్రెస్ దేశాన్ని అనేక ఏండ్లు పా లించినా కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలకులు బీసీల కులగణన ఎందుకు చేయలేదో చెబుతూ పార్లమెంట్ ముందు రాహుల్‌గాంధీ ముక్కు నేలకు రాయాలని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల అమలుకై శనివారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయంగా, చట్టబద్ధంగా దేశమంతా కులగణన చేయాలని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది జనాభా లెక్కల్లో బీసీల కులాగణన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా సీఎం రేవంత్‌రెడ్డి అసంబద్ద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించకుండా చేతకానితనంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై బట్టకాల్చి వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో 150 డివిజన్లలో 33 శాతం డివిజన్లను గతంలో బీసీలకు కేటాయించే పరిస్థితి ఉండేదని కానీ కేసీఆర్ పోతూ పోతూ బీసీ రిజర్వేషన్లను తగ్గించడం వల్ల ముస్లింలు బీసీ రిజర్వేషన్ ఫలాలను పొందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి అదే బాటులో నడుస్తున్నాడన్నారు. 34 శాతం మేర ఉన్న బీసీ రిజర్వేషన్లను 32 శాతానికి తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే.. బీసీలకు మిగిలేది 32 శాతమే అని అన్నారు.

42 శాతం అంటూ ఇప్పుటికే ఉన్న 34 నుంచి 2 శాతాన్ని తగ్గిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో కనీసం 20 శాతం ఇండ్లను కూడా సందర్శించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42కు 42 శాతం రిజర్వేషన్లు కేవలం బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులోంచి ముస్లింలకు ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

రిజర్వేషన్ల అంశంలో రేవంత్ డ్రామా: ఎంపీ ఆర్.కృష్ణయ్య 

సీఎం రేవంత్‌రెడ్డి బీసీల రిజర్వేషన్ల విషయంలో డ్రామా చేస్తున్నారని, కేంద్రం, బీజే పీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఈ కుతంత్రాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉన్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గ్యారెంటీగా అధికారంలోకి వస్తుందని భావించే దాన్ని అడ్డుకోవడానికి ఏదో ఒక వర్గానికి వ్యతిరేకమన్న ముద్ర వేయడానికి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

స్థానిక సంస్థలన్నీ పూర్తిగా రాష్ర్ట ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి బీసీలకు న్యాయం చేయడానికి పూర్తి అధికారాలు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నాయ న్నారు. రాజ్యాంగంలోని 243-డి(6) ప్రకారం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే పూర్తి అధికారమూ రాష్ర్ట ప్రభుత్వానికే ఉందని తెలిపారు. బిల్లును గవర్నర్ వద్దకు, ఢిల్లీకి పంపించారని అక్కడ కూడా బీజేపీ అడ్డంకులు కలిగించలేదన్నారు. 

అబద్ధాలతో కాలం గడుపుతున్న సీఎం : ఎంపీ ఈటల రాజేందర్

సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంలో మొసలికన్నీళ్లు కారుస్తున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించిండన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మాట ఏమైందన్నారు.  కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ మండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ ఓబీసీ మోర్ఛా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తూ అందులో కేవలం 32 శాతం మాత్రమే బీసీలకు ఇవ్వాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంఐఎం ఒత్తి డితో మిగతా 10 శాతం మాత్రం ముస్లింలకు కేటాయించాలని చూస్తున్నారని ఆరోపించారు.

మతపరమైన రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ పేరిట తేవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే... 42 శాతం రిజర్వేషన్లలోని ముస్లింలకు కేటాయించిన 10శాతాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలోని 9 కార్పొరేషన్‌లకు చైర్మన్లను నియమించగా అందుకో కేవలం ఒక్కరే బీసీ అని ఇక్కడే బీసీలపై కాంగ్రెస్ వైఖరి అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ కేబినెట్‌లో కేవలం ముగ్గురు బీసీ మం త్రులే ఉన్నారని తెలిపారు.

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50 బీసీ డివిజన్లలో 35 డివిజన్లు మజ్లిస్‌కు కేటాయించారని దీనివల్ల బీసీల హక్కుల ను కాలరాశారని పేర్కొన్నారు. ఇప్పుడు బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని బీసీల కు పిలుపునిచ్చారు. యూపీఏ హ యాంలో కేంద్రంలో 2011లో సా మాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ, కు ల స్థితిగతులపై కులగణన జరిపారని.. ఆ గణాంకాలను ఎందుకు బు ట్టదాఖలు చేశారో చెప్పాలన్నారు.