10-06-2025 10:42:14 PM
మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాలలో నిరుపేద కుటుంబానికి మండల కాంగ్రెస్ నాయకులు చేయూతనిచ్చారు. మంగళవారం మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంతని వెంకయ్య అకాల మరణంతో వారి కుటుంబ సభ్యులకు రెండు క్వింటాల బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేసారు. నాయకులు మాట్లాడుతూ... భవిష్యత్తులో ఏలాంటి ఇబ్బంది ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము. ఈధరావు ఎండి రషీద్. పి జాన్. ఎల్ శ్రీనివాస్. చింతకాయల నాగరాజు, శెట్టి గిరి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.