calender_icon.png 28 December, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష

28-12-2025 01:18:50 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): దేశానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...  భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ  కాంగ్రెస్ పార్టీ అని, నిరు పేదలకు బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ దేశానికి నాడైనా, నేడైనా కాంగ్రెస్ పార్టీనే శ్రీరామ రక్ష అని, ఈ దేశానికి రాహుల్ గాంధీ ని ప్రధాని చేసి దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.