28-12-2025 01:15:36 PM
తాండూరు,(విజయ క్రాంతి): పేదలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఎన్ని అవంతరాలు ఎదురైనా జాతీయస్థాయిలో నిల దక్కుకొని పేదలకు ఆసరాగా నిలుస్తుందని వికారాబాద్ జిల్లా తాండూరు ఆ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు తాండూరు పట్టణ శాఖ అధ్యక్షులు అభిలాల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి వారి అభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి చేరేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కోర్వార్ నగేష్, లింగదల్లి రవి, రియాజ్, వడ్డే శ్రీనివాస్, జిలాని, శ్రీకాంత్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.