calender_icon.png 19 December, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఉప సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వార్డు సభ్యులు

19-12-2025 09:13:01 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కితవారిగూడెంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా చిత్తలూరు వీరస్వామిని కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి షేక్ చాంద్ మియా మాట్లాడుతూ... గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయడంతో పాటు గ్రామాన్ని ఆదర్శ పథంలో నడిపించాలని ఆయన కోరారు.

అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఉపసర్పంచ్ విరస్వామిని చాంద్ మియా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారు సైదులు,ముత్తినేని హరిబాబు, షేక్ సఫియామీరా, గుండు పూలమ్మ సైదులు, బండారు అంజయ్య, గూడెపు వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ సుబ్బయ్య, మాజీ ఎంపిటిసి కీత మట్టయ్య, కీత సునీత రామానాధం, రామకృష్ణ, సురేష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.