19-12-2025 09:16:49 PM
హనుమకొండ బిజెపి జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): దామెర మండలం కోగిల్వాయ్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన బిజెపి బలపరిచిన అభ్యర్థి చుక్క వనిత మహేందర్ , ఇతర వార్డు మెంబర్లను బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి , ఇతర నాయకులతో కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ వల్లనే పల్లెలు అభివృద్ధి చెందుతాయని సంకల్పంతో బిజెపి బలపరిచిన అభ్యర్థిని గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కోగిల్వాయి గ్రామాన్ని అభివృద్ధి పథంలో, అందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా చూస్తానని ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి తెలిపారు.