22-07-2025 12:51:28 AM
ఎల్లారెడ్డిపేట,జూలై21(విజయక్రాంతి)మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ.రా నున్న స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు సర్పంచులుగా,ఎంపీటీసీలు జడ్పిటిసిలుగా,ఎంపీపీలు గా గెలుపొందాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వ ద్దకు తీసుకువెళ్లి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పాత కొత్త వారిని కలుపుకొ ని అభ్యర్థులను గెలిపించుకునేలా కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు.కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలను తీసుకొని గ్రామాల వారిగా ఎస్సీ, ఎస్టీ,బీసీ,ఓసి రిజర్వేషన్లకు అను కూలం గా అభ్యర్థులను నిర్ణయించుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు మేడిపల్లి దేవానందం,జిల్లా కార్యదర్శులు గిరిధర్ రెడ్డి, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే సాహెబ్,కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాసరెడ్డి, మెండేశ్రీనివాస్,రవీం