22-07-2025 12:51:27 AM
ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు..
ఆదిలాబాద్, జూలై 21 (విజయక్రాంతి): తమ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాంసి మండలం పోన్నారి గ్రామస్థులు రోడ్డెక్కారు. సోమవా రం ఖాళీ బిందెలతో మహిళలు అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహ నాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా అటుగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, డీసీసీబీ ఛైర్మన్ భోజ రెడ్డి నిరసన కారుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
వెంటనే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పడంతో మహిళలు నిరసన విరమించారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. రెండు, మూడు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామ ని వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పినా స్పందన లేదన్నారు. ఉన్న తాధికారులు, నాయకులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.