calender_icon.png 22 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

22-07-2025 12:52:42 AM

కరీంనగర్ క్రైం, జూలై21(విజయక్రాంతి): అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపి గా గెలవడమే కాకుండా నిబద్ధతకు నిలువుటద్దంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆటుపొట్లు ఎదుర్కున్నా విడిచి పెట్టకుండా పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు ఖర్గే అని కొనియాడారు.కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా ఖర్గే పని చేస్తున్నారని అన్నారు.

కార్యక్రమంలో ఎండి తాజ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,సమద్ నవాబ్,కర్ర రాజశేఖర్,జీడి రమేష్,దండి రవీందర్,దన్న సింగ్,నిహాల్ అహ్మద్, వంగల విద్యాసాగర్,షబానా మహమ్మద్, నెల్లి నరేష్,ముల్కల కవిత,చింతల కిషన్ నాగుల సతీష్ ,గంగుల దిలీప్,కాంపెల్లి కీర్తి కుమార్,కొట్టె ప్రభాకర్,మాసూమ్ ఖాన్,ఖలీల్,ఆస్తాపురం తిరుమల,పద్మ తదితరులుపాల్గొన్నారు.