16-12-2025 12:27:27 AM
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల, డిసెంబర్ 15 : కాంగ్రెస్ కార్యకర్తలే స్థానిక సంస్థల కుర్చీలో కూర్చోవాలని అందుకోసం పార్టీ కోసం పని చేసే వారికే టికెట్ ఇచ్చామని అన్నారు. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందాలని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు.
సోమవారం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు భాగంగా అడ్డాకుల మండలం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ దశరథరెడ్డి, కందూర్ లక్ష్మీ, కాటవరం సర్పంచ్ అభ్యర్థి మాధవి, శాఖపూర్ సర్పంచ్ అభ్యర్థి సుశీల గ్రామాల్లో ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిపించిన కార్యకర్తలే స్థానిక సంస్థలో కుర్చీల్లో కూర్చుంటే ప్రభుత్వానికి, పార్టీకి గౌరవం దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తేనే గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు.
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ రెండు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, సీసీ రోడ్లు, రైతు భరోసా, రుణమాఫీ, వరి పంటకు బోనస్, కరెంటు ఉచితంగా, ఉచిత బస్సు, మహిళలు గౌరవంగా బతికేందుకు మహిళా సంఘాల్లో ఒక్కరికి రూ 10 లక్షల రుణాల అందిస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టండి ఆయన కోరారు. విజయ మోహన్ రెడ్డి, నాగిరెడ్డి, తోట శ్రీహరి, శేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.