16-12-2025 05:01:31 PM
సుల్తానాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికలు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలంలో బుధవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కొరకు మంగళవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో సంబంధిత గ్రామాలకు వెళ్లారు. ఎంపీడీవో దివ్యదర్శనం రావు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. సుల్తానాబాద్ మండలంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 228, మొత్తం పోలింగ్ సిబ్బంది 559 మంది, పోలీసు సిబ్బంది 185, డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది 150, మొత్తం వెయ్యి మంది సిబ్బందికి ఉదయము టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మొత్తం 18 రూట్లకు గాను 18 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే 18 మంది రూట్ ఆఫీసర్లు, ఐదుగురు జోనల్ ఆఫీసర్లు వెళ్లడం జరిగిందని చెప్పారు. బుధవారం ఉదయము ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. రెండు గంటలకు కౌంటింగ్ జరుగుతుందని, కౌంటింగ్ పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక జరుపుకొని పోలింగ్ సిబ్బంది తిరిగి జూనియర్ కళాశాలలో పోల్ మెటీరియల్ అందజేస్తారని అన్నారు. దీనితో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఎంపీడీవో దివ్యదర్శనరావు తెలిపారు.