16-12-2025 12:28:24 AM
కేసముద్రం, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం హనుమంతరావు కాలనీలో గొట్టం మల్లయ్య అనారోగ్యంతో మరణించాడు. సోమవారం నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్దకూతురు రోజా తండ్రి చితికి నిప్పంటించి తలకొరివి పెట్టింది. మల్లయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.