16-12-2025 05:16:08 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గడిచిన 10 ఏళ్లలో కంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి కాలనీనీ అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి 54వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో రెండు కోట్ల రూపాయలతో మంచినీటి పైపులైను పనులుకు అలాగే 9వ డివిజన్ కాకతీయ కాలనీ ఫేస్ టులో 47 లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్, సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా 54వ డివిజన్ ప్రత్యేకంగా దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ప్రకారం ఒక్కొక్కటి అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు.
మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉన్నదని అన్నారు. ప్రధాన రోడ్డులు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే వంద శాతం పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలోని ప్రధాన పార్కుల స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. గడిచిన రెండేళ్లలో నగరంలో చాలావరకు కబ్జాలు తగ్గాయని, ఎవరైనా కబ్జాలకు పాడిపడితే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు గుంటి రజిత శ్రీనివాస్, చీకటి శారద ఆనంద్, డివిజన్ అధ్యక్షులు నల్ల సత్యనారాయణ, ఎం.డి జాఫర్, కాకతీయ కాలనీ ఫేస్ టు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీపాద లక్ష్మీపతి, శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మండల శంకరయ్య, కాంగ్రెస్ శ్రేణులు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.