23-11-2025 08:49:49 PM
డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి..
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల అత్యధిక స్థానాలు గెలుపొందించుటకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలు అన్నారు. ఆదివారం సాయంత్రం కీర్తిశేషులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసంలో నూతనంగా జిల్లా అధ్యక్షులు ఎన్నికైన గుడిపాటి నరసయ్యను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలోని గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తల బాగోగులు చూసిన వ్యక్తి కీర్తిశేషులు మాజీ మంత్రి దామోదర్ రెడ్డినే అని కొనియాడారు.
నాకు కాంగ్రెస్ పార్టీ బిక్ష పెట్టింది మాజీ మంత్రి దామన్న నేనని నరసయ్య అన్నారు. జిల్లా అధ్యక్ష పదవి అంటే ముళ్ళ మీద ప్రయాణమేనని, అయినప్పటికీ చిత్తశుద్ధితో ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కార కోసం నిరంతరంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కార్యకర్తలు గ్రూపులు మరిచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మహిళా పార్టీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, రామాలయ చైర్మన్ సంజీవ, పెండెం రామ్మూర్తి, అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రేగటి రవి రేగటి వెంకటేష్ దాసరి శ్రీను పెద్ద బోయిన అజయ్ అనిల్ కుమార్ కొండరాజు, నాగరాజు, వీరబోయిన రాముల యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.