calender_icon.png 23 November, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం మన కర్తవ్యం

23-11-2025 08:53:36 PM

బోడుప్పల్లో 353వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల..

ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్..

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 353వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి, నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వజ్రేష్ యాదవ్ ను అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ దేశంలోని అన్ని వర్గాలకు హక్కులు, ఆత్మగౌరవం కావాలని దానికి భారత రాజ్యంగమే ఏకైక మార్గమని బలంగా వాదించి, తన జీవితాన్ని త్యాగం చేసి మహోన్నత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని, నేడు భారతదేశంలో ప్రజలే పాలకులుగా ప్రజాస్వామ్యం కొనసాగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి,కీసర గుట్ట డైరెక్టర్ రాపోలు శంకరయ్య, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బొమ్మకు కళ్యాణ్, సుమన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన గళ్ళయాదగిరి,జై రాములు, రాపోలు ఉపేందర్, రాపోలు రామ స్వామి, తెలంగాణ రాష్ట్ర భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మందుల సూర్య కిరణ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సెక్రటరీ ఇటుకల రవీందర్, అంబేద్కర్ ఆశయ సాధన  సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.